Google సంచలన యాప్‌ వచ్చేసింది.. ఫోన్‌లో నెట్‌ లేకున్నా ఉపయోగించొచ్చు!

Bala
google new feature

Google AI Edge Gallery : టెక్నాలజీ రాకెట్‌ వేగంతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence) వినియోగం రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది.

Google launches a New Android App AI Edge Gallery : ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ మరో సంచలనానికి తెరతీసింది. ఇప్పటి వరకు ఏ యాప్‌ యూజ్‌ చేయాలన్నా మన ఫోన్‌లో ఇంటర్నెట్‌ ఉండాల్సిందే. అయితే.. తాజాగా గూగుల్‌ ‘ఏఐ ఎడ్జ్‌ గ్యాలరీ’ ( Google AI Edge Gallery ) పేరిట ఓ కొత్త AI యాప్‌ను తీసుకొచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో.. మన స్మార్ట్ ఫోన్లలో ఏఐ ( artificial intelligence ) వినియోగాన్ని డిఫరెంట్ అండ్ ఇంట్రెస్ట్‌గా మార్చే ఈ క్రేజీ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ క్రేజీ యాప్‌ ద్వారా మన ఫోన్‌లో ఇంటర్నెట్‌ లేకున్నా మనం ఏఐ మోడల్స్‌ను ఉపయోగించుకోవచ్చు. వివరాల్లోకెళ్తే..

ఈ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ యాప్ ద్వారా మీ ఫోన్‌లో ఇంటర్నెట్‌ లేకున్నా ఏఐ మోడల్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇంటర్నెట్ లేకున్నా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence)తో ఇమేజ్‌లను సృష్టించడం (Image Creation), కోడ్ రాయడం, సమాధానాలు రాబట్టడం వంటివి సులభంగా చేయొచ్చు. ఇందులో మరో ప్రధానమైన విషయం ఏమిటంటే.. యూజర్‌ ప్రైవసీ (User Privacy)కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే యూజర్లు అందించే డేటా క్లౌడ్ (Data Cloud) సర్వర్లకు వెళ్లకుండా మొత్తం మొబైల్‌ ఫోన్లో బ్యాక్ఎండ్‌లో రన్ అవుతుంది. ఇది సెక్యూరిటీ రిస్క్‌ను కూడా తగ్గిస్తుంది. అలాగే పనితీరు కూడా చాలా చాలా వేగంగా ఉంటుంది. సర్వర్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా యూజర్లు అడిగే ప్రశ్నలకు వెంటనే రిప్లయ్‌ ఇచ్చే ఆస్కారం ఏఐ ( AI )కి ఉంటుంది.

అయితే Google AI Edge Gallery యాప్‌ గెమ్మా 31బీ అనే లాంగ్వేజ్ మోడల్‌పై ఆధారపడి పనిచేస్తుంది. కేవలం 529 ఎంబీ పరిమాణంలో వచ్చే కాంపాక్ట్ మోడల్. అపాచీ 2.0 లైసెన్స్‌తో వస్తోంది. ఇది విద్య, వాణిజ్య అవసరాలకు కూడా వినియోగించుకునేందుకు అనుమతిస్తుంది. ఇది ఒక సెకనుకు 2,585 టోకెన్లను ప్రాసెస్ చేయగలదు. పెద్ద మొత్తంలో టెక్ట్స్‌ను ఇట్టే క్షణాల్లో జనరేట్ చేయగలదు. గెమ్మా పరిమాణం చిన్నదైనప్పటికీ కంటెంట్‌ క్రియేట్‌ చేయడం (Content Creation), డాక్యుమెంట్లను విశ్లేషించడం, స్మార్ట్ రిప్లయ్‌ ఇవ్వడం వంటి పనులను క్షణాల్లో చేయగలదు. ప్రస్తుతానికి ఈ Google AI Edge Gallery యాప్‌ ఓపెన్ సోర్స్‌లో అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ గూగుల్‌ ఏఐ ఎడ్జ్‌ గ్యాలరీ యాప్ ఐఓఎస్ (ios) వెర్షన్‌ను కూడా విడుదల చేయనున్నట్లు గూగుల్ (Google) ప్రకటించింది.

Share This Article
2 Comments
  • Heyy juwt wanteԁ too give yyou a quick heads
    սp. Thе words in your article seem to ƅe running off the
    screen iin Firefox. Ι’m nnot sure іf this is a formatting issue օr
    sοmething to ԁo ᴡith browser compatibility ƅut I figured I’d post tօ let
    ʏou know. Thе layout look grest thougһ!
    Hope you get the issue solved ѕoon. Many tһanks

    my web blog … ip math tuition 110

  • Hmm is anyone else having problems with the images on this
    blog loading? I’m trying to determine if its a problem on my end or if it’s the blog.
    Any feedback would be greatly appreciated.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *